News November 21, 2024

ఈ సముద్రాలు కాంతులీనుతాయి!

image

రాత్రి వేళ సముద్రతీరాన ఉండే అనుభూతే వేరుగా ఉంటుంది. మరి సముద్రం నీలికాంతులతో ధగధగలాడుతుంటే ఇంకెంత అందంగా ఉంటుంది? భూమిపైకి స్వర్గమే వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ కాంతుల్ని బయోలుమినిసెన్స్ అంటారు. భారత్‌లో అలాంటి సముద్ర తీరాల్లో కొన్ని.. కేరళలోని మునాంబం బీచ్, అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఒకటైన హావ్‌లాక్ దీవి, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్‌పూర్ బీచ్, గోవాలోని కేరీ బీచ్, లక్షద్వీప్‌లోని బంగారం దీవి.

Similar News

News November 24, 2024

ఐపీఎల్ మెగా వేలం UPDATES

image

* నమన్ ధిర్‌ను రూ.5.25కోట్లకు కొనుగోలు చేసిన MI
* నెహాల్ వధేరాను రూ.4.20కోట్లకు కొనుగోలు చేసిన PBKS
* అభినవ్ మనోహర్‌ను రూ.3.20కోట్లు పెట్టి కొన్న SRH
* రఘువంశిని రూ.3కోట్లకు సొంతం చేసుకున్న KKR
* సమీర్ రిజ్విని రూ.95లక్షలకు దక్కించుకున్న DC
* రూ.30 లక్షలకు అథర్వ తైదెను దక్కించుకున్న SRH
* రూ.50 లక్షలకు కరుణ్ నాయర్‌ను కొన్న DC

News November 24, 2024

మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు: హైడ్రా కమిషనర్

image

HYD మధురానగర్‌లోని తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 44ఏళ్ల కిందట తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని చెప్పారు. ఆ పార్క్‌‌కు తమ ఇంటికి మధ్య కి.మీ. దూరం ఉందని వివరించారు. చెరువు కట్ట దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదన్నారు.

News November 24, 2024

అలాంటి కాల్ వస్తే భయపడొద్దు!

image

అనుమానిత వస్తువుల కొరియర్ అంటూ, వీడియో కాల్ చేసి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెడతామని సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తున్నట్లు AP పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. పోర్న్ సైట్లు చూస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఫైన్ కట్టాలని కాల్ చేసి డబ్బులు దోచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై 1930కి కాల్ చేయడంతో పాటు www.cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.