News September 25, 2024
ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!

ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.
Similar News
News November 28, 2025
అమ్మానాన్నల మీద నిందలు వేస్తున్నారా..?

మాతృ నింద మహా వ్యాధిః పితృ నింద పిశాచతః
దైవ నింద దరిద్ర స్యాత్ గురు నింద కుల క్షయం
ఈ శ్లోకం ప్రకారం.. తల్లిని నిందించే వారికి వ్యాధులు కలుగుతాయి. తండ్రిని నిందిస్తే పిశాచత్వం ప్రాప్తిస్తుంది. దైవ నిందతో దరిద్రులవుతారు. అలాగే గురువును నిందించినట్లయితే వంశమే నాశనం అవుతుందట. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పే గురువులను, లోకాన్ని సృష్టించిన దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదని అంటారు.
News November 28, 2025
WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.
News November 28, 2025
నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


