News December 15, 2024
అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే: గడ్కరీ
దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే 4 రాష్ట్రాల వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. ఈ ఏడాది అత్యధికంగా యూపీలో 23,652 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు (18,347), మహారాష్ట్ర (15,366), మధ్యప్రదేశ్ (13,798) ఉన్నాయి. యాక్సిడెంట్లలో ఏటా 1,78,000 మంది చనిపోతున్నారని, వీరిలో 18-34ఏళ్ల వయసున్న వారే 60% మంది అని ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 5, 2025
తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్గేట్స్
తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.
News February 5, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్పై కేసులు నమోదయ్యాయి.
News February 5, 2025
హీరోపై కేసు నమోదు!
స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.