News April 12, 2025
ఈ పదార్థాలు హానికరం: వైద్యులు

మనం రోజూ తినే కొన్ని ఆహారాల్లో పెట్రోల్ నుంచి సేకరించిన పదార్థాలు వాడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రాసెస్ చేసిన మిల్లెట్స్, ఆలూ చిప్స్, చాక్లెట్స్ ద్వారా పెట్రోల్ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. చిప్స్ పాడవకుండా టెర్షియరీ బ్యుటైల్ హైడ్రోక్వినన్ వాడతారు. అలాగే డోనట్స్లో పెట్రోల్ నుంచి సేకరించిన ప్రొపైలిన్ గ్లైకాల్
& ఐస్క్రీమ్స్, సలాడ్స్లో ఎమల్సిఫైయర్ వాడతారు’ అని సూచించారు.
Similar News
News January 3, 2026
వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి!

AP: బైక్పై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనను విశాఖ పోలీసులు అమలు చేస్తున్నారు. వాహనం నడిపే వారితోపాటు, పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోకున్నా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. జనవరి 1 నుంచి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే వేలాది మందికి చలాన్లు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై గత సెప్టెంబర్ నుంచి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నారు.
News January 3, 2026
1,146పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

SBI 1146 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి అప్లై గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులను ప్రకటించగా.. మరో 150 పోస్టులను కలిపి గడువును JAN 10 వరకు పెంచింది. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. VP వెల్త్, AVP వెల్త్, CRE పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 3, 2026
మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుదాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.


