News November 7, 2024
కిడ్నీ పనితీరుకు ఈ లక్షణాలే సూచనలు

శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో మూత్రపిండాలది కీలక పాత్ర. మరి మన కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నాయనడానికి సూచనలేంటి? వైద్య నిపుణుల ప్రకారం.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఒళ్లు, కాళ్లు నీరు పట్టినట్లు కనిపిస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా అనుమానించాల్సిందే. ప్రధానంగా మధుమేహం, బీపీ ఉన్నవారు, ధూమపాన ప్రియులు కచ్చితంగా కిడ్నీ పరీక్షల్ని తరచూ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 29, 2025
సిరిసిల్ల: ‘గర్భస్థ లింగ నిర్దారణ నేరం’

గర్భస్థ శిశు లింగ నిర్దారణ నేరమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా పీసీపీఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ.. జిల్లాలో 27 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ నమోదు చేశామని, ప్రతి నెల 8 స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
News November 29, 2025
ఈ ఫైనాన్స్ జాబ్స్‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.
News November 28, 2025
ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసుకోండి!

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్‌ను<<>> అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్‌లో ‘Aadhaar’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.


