News November 4, 2024

బీటెక్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలదే అధిక వాటా!

image

ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీ కంటే బీటెక్ చదివేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 3,08,686 సీట్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532 & తెలంగాణలో 1,45,557 సీట్లున్నాయి. ఇలా చూస్తే దేశంలోని ఇంజినీరింగ్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలే 40శాతం వాటా కలిగి ఉన్నాయి.

Similar News

News September 13, 2025

ట్రెండింగ్.. బాయ్‌కాట్ ఆసియా కప్

image

ఆసియా కప్‌లో రేపు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్, బాయ్‌కాట్ INDvsPAK’ అనే హ్యాష్ ట్యాగ్‌లు Xలో ట్రెండ్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తామింకా మరిచిపోలేదని, PAKతో క్రికెట్ ఆడొద్దని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచును BCCI బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలు బ్యాన్ చేయాలంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. రేపు మీరు మ్యాచ్ చూస్తారా? కామెంట్ చేయండి.

News September 13, 2025

DSC అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

image

AP: డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. నిన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.

News September 13, 2025

కాంగోలో పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి

image

కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. ఈక్వేటార్ ప్రావిన్స్‌కు 150 కి.మీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు. 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు.