News May 19, 2024
వారంతా పొలిటికల్ టూరిస్టులు: నవీన్ పట్నాయక్

తమ ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు చేస్తున్న విమర్శలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడు అక్కడికి వచ్చే వారందరూ పొలిటికల్ టూరిస్టులని అన్నారు. ఒడిశాను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన హామీలపై మండిపడ్డారు. ముందు తమ రాష్ట్రాల పరిస్థితి చూసుకోవాలని అన్నారు. తమ మాటలకు ఒడిశా ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News January 24, 2026
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.
News January 24, 2026
అరుణోదయ స్నానం చేయడానికి జిల్లేడు ఆకులు దొరకకపోతే…

రథసప్తమి పర్వదినాన ఆచరించే అరుణోదయ స్నానానికి జిల్లేడు ఆకులు తప్పనిసరి. అవి దొరకకపోతే వాటికి బదులుగా చిక్కుడు/రేగు ఆకులు వాడొచ్చని పండితులు చెబుతున్నారు. చిక్కుడు ఆకులు, కాయలతో రథాన్ని రూపొందించి, తమలపాకుపై రక్తచందనంతో సూర్య బింబాన్ని తీర్చిదిద్ది ఆవాహన చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. ఈరోజున స్త్రీలు నోములు నోచుకోవడం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
News January 24, 2026
బ్యాంకు ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలం

సమ్మె విరమించుకోవాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంకు యూనియన్స్(UFBU)తో చీఫ్ లేబర్ కమిషనర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులతో గురు, శుక్రవారం చర్చలు జరిపినా వారి నుంచి సానుకూల స్పందన రాలేదని UFBU ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముందు చెప్పిన విధంగా JAN 27న సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు(నాల్గవ శనివారం, ఆది, రిపబ్లిక్ డే, సమ్మె) పనిచేయవు.


