News October 7, 2025
జామాకులనూ ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు!

ఎండిన, పచ్చి జామాకులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ బాగా పెరిగింది. వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Similar News
News October 7, 2025
గ్రూప్-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
News October 7, 2025
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు: జగన్

AP: విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ‘మనం మరో 5 ఏళ్లు కొనసాగుంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేవారు. మన విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వడం లేదని, పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పారు. రైతులనూ నిండా ముంచారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎరువులు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.
News October 7, 2025
మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.