News January 2, 2025

క్యాన్సర్, షుగర్‌ను కొని తెచ్చుకుంటున్నారు!

image

ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ సేవించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించినా ప్రజల్లో మార్పు రావట్లేదు. వీటివల్ల ఊబకాయం, మధుమేహంతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం భారత్‌లోని గ్రామీణులు నెలవారీ బడ్జెట్‌లో 9.84%, సిటీవాసులు 11.09% ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఇరవైఏళ్ల క్రితం గ్రామీణులు వీటిపై కేవలం 4% ఖర్చు చేసేవారు.

Similar News

News October 19, 2025

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

image

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.

News October 19, 2025

అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం

News October 19, 2025

ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

image

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?