News December 21, 2024

పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి

image

AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.

Similar News

News February 5, 2026

USతో ట్రేడ్ డీల్.. భారత్‌పై పాక్‌లో ప్రశంసలు

image

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత పాక్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా PM షరీఫ్ సుంకాల విషయంలో పురోగతి సాధించలేకపోయారని ఆ దేశ పౌరులు ఫైరవుతున్నారు. ఏం చేసినా గౌరవాన్ని కొనలేరని నిరూపితమైందన్నారు. పాక్‌ను చట్టవిరుద్ధమైన పనులు చేసే ఉంపుడుగత్తెలా ట్రంప్ చూశారని మండిపడుతున్నారు. భారత నాయకత్వం దేశం దాటకుండానే అద్భుతం చేసిందని కొనియాడుతున్నారు.

News February 5, 2026

పశువుల పాలను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

image

పశువుల పాలను తీసే సమయంలో డెయిరీఫామ్ నిర్వహించేవారు, పాడి రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పాలను సేకరించాలని, పొదుగు నుంచి పాలను పూర్తిగా తీయకుండా వదిలేయడం మంచిది కాదంటున్నారు. మిల్క్ సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు మంచి ధర ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 5, 2026

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

image

<>ఢిల్లీలోని<<>> ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MSc(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/మాలిక్యులార్ బయాలజీ/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/