News January 30, 2025
నా సినిమాలో వాళ్లు నటించట్లేదు: RGV

విక్టరీ వెంకటేశ్ సహా పలువురు స్టార్లు తన నెక్స్ట్ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాను ‘సిండికేట్’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్న మాట మాత్రం నిజమేనని అన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News October 18, 2025
నిద్రమత్తులోనే ఉండండి.. టీటీడీపై HC ఆగ్రహం

AP: పరకామణిలో అక్రమాల వ్యవహారంపై ఇటీవల పోలీస్ శాఖపై <<17999947>>విరుచుకుపడ్డ<<>> హైకోర్టు నిన్న టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరికొంత కాలం నిద్రమత్తులోనే ఉండండి అంటూ మండిపడింది. కౌంటర్ ఎందుకు వేయలేదని ఈవోపై ఆగ్రహించింది. తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.
News October 18, 2025
విత్తనాలు కొంటున్నారా? రసీదు జాగ్రత్త..

రబీ సీజన్ ప్రారంభమైంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీల్ తీసి ఉన్న, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాలను కొనరాదు. తూకం వేసి విత్తనాలు తీసుకోవాలి. విత్తనం వల్ల పంట నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే పంటకాలం పూర్తయ్యేవరకు కొనుగోలు రశీదులను రైతులు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత సరిగా రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం.
News October 18, 2025
మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?

TG: BC సంఘాల ‘రాష్ట్ర బంద్’ పిలుపు మేరకు పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులిస్తూ తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. OU పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనుండగా బంద్ పాటించాలని BC, విద్యార్థి సంఘాలు కోరే అవకాశముంది. మరోవైపు RTC డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పార్టీలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నాయి. ఇంతకీ మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?