News October 25, 2024
వారికి ఓటు హక్కు ఇవ్వలేదు: CEO

MLC ఎన్నికల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఓటు హక్కు కల్పించలేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ స్పష్టం చేశారు. ఓటు అర్హతపై గత నిబంధనలే కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు DEOలకు వెల్లడించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
Similar News
News February 6, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 6, 2026
గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

దేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్ హెడ్స్‌కు డిమాండ్ పెరిగిందని తెలిపింది.
News February 6, 2026
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

TG: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి డిమాండ్ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.


