News July 12, 2024
వాళ్లు మైనర్లు కాదు.. శిక్ష పడాల్సిందే: రష్మీ గౌతమ్

AP: నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై 6, 7వ తరగతి చదువుతున్న బాలురు <<13613421>>హత్యాచారం<<>> చేయడంపై యాంకర్, నటి రష్మీ గౌతమ్ స్పందించారు. ‘వాళ్లు పెద్దవాళ్లలా అత్యాచారం చేయగలిగితే.. శిక్ష కూడా అలాగే ఉండాలి. ఏం చేశారో తెలియనంత అమాయకులు వాళ్లు కాదు. నిందితులు కచ్చితంగా మైనర్లు కాదు. మైనర్లు అనే నెపంతో వాళ్లు తప్పించుకోకూడదు’ అని Xలో ఏపీ CMOను ట్యాగ్ చేశారు.
Similar News
News October 16, 2025
ట్రంప్ ‘ఆయిల్’ కామెంట్స్‌పై భారత్ స్పందన

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమంటూ మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ <<18018198>>వ్యాఖ్యలపై<<>> భారత్ స్పందించింది. తాము ఆయిల్, గ్యాస్ ప్రధాన దిగుమతిదారని, దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను బట్టే కొనుగోలు చేస్తామని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు రూపొందించామన్నారు. అటు ఇంధన సేకరణ పెంచుకోవడానికి అమెరికాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.
News October 16, 2025
బిహార్‌లో.. రాజు లేని యుద్ధం.. గెలుస్తారా..?

మనం చూడని చరిత్రలో, చూసిన బాహుబలిలో, ఆడే చెస్‌లో రాజు లేడంటే ఆ యుద్ధం ముగిసి, ప్రత్యర్థి గెలిచినట్లే. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ సహజ విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా వెనకుండి నడిపించిన ఆయన బిహార్‌లో జనసురాజ్ పార్టీ పెట్టారు. ఇక్కడా తను పోటీ చేయకుండా JSP అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలో సొంత నేతలకే తెలియట్లేదు.
News October 16, 2025
ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.