News August 29, 2025
జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు: షర్మిల

AP: వైఎస్ వివేకానంద హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదు? సునీత ఆరోపణల్లో నిజం ఉంది. CBI తలుచుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేది. జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు. హత్య జరిగిన సమయంలో అవినాశ్ అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 29, 2025
ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తోనే ఇండియాపై 50% టారిఫ్స్: Jefferies

ట్రంప్ తన వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్‌తోనే ఇండియాపై 50% టారిఫ్స్ విధించారని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘Jefferies’ అభిప్రాయపడింది. సుంకాలకు వాణిజ్యం ముఖ్య కారణం కాదని పేర్కొంది. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఇండియా ఒప్పుకోకపోవడం ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌కు ప్రధాన కారణమని వెల్లడించింది. అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ మార్కెట్‌లోకి అంగీకరించకపోవడమూ ఓ కారణమని తెలిపింది.
News August 29, 2025
బ్రాంకో టెస్ట్‌కు రోహిత్ సిద్ధం.. ఎప్పుడంటే?

యోయో, బ్రాంకో టెస్టుల్లో పాసయ్యేందుకు టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తన ట్రైనర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా ఈ టెస్టులు నెగ్గాలనే కృతనిశ్చయంతో హిట్‌మ్యాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్‌కు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ యోయో, బ్రాంకో టెస్టు నిర్వహిస్తుందని సమాచారం.
News August 29, 2025
భారత్-చైనా స్నేహం ప్రపంచానికి ముఖ్యం: PM

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్, చైనా కలిసి పని చేయడం ముఖ్యమని PM మోదీ అన్నారు. చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శ్రేయస్సుకు అవసరమని తెలిపారు. గతేడాది జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు సంబంధాల్లో పురోగతి కనిపించిందని, ఆయన ఆహ్వానం మేరకు SCO సమావేశానికి వెళ్తున్నానని చెప్పారు. జపాన్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.