News November 20, 2024

అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు: రేవంత్

image

TG: పదేళ్లలో KCR చేయలేని పనులను తాము పూర్తి చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. KCR ఫామ్‌హౌస్‌లో పడుకుంటే KTR, హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. BRS సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి KCR పదేళ్లు తీసుకుంటే, తాము 25 రోజుల్లో రూ.18వేల కోట్లు మాఫీ చేశామని వేములవాడ సభలో CM స్పష్టం చేశారు.

Similar News

News November 20, 2024

ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా!

image

ఆస్ట్రేలియా ఏటా 7 సెంటీమీటర్ల మేర ఉత్తర దిశగా కదులుతోంది. ఖండాల కింద ఉండే భూ ఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కదలిక మరీ ఎక్కువగా ఉన్న చోట భూకంపాలు కూడా సంభవిస్తుంటాయి. ఆస్ట్రేలియా కింద ఉన్న ఫలకమంతా ఉత్తరదిశగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, అది వేరే ఏ ఖండాన్ని ఢీ కొట్టాలన్నా లక్షల సంవత్సరాలు పడుతుందని అంచనా.

News November 20, 2024

ఈ చేపలు తింటే అయోమయానికి లోనవుతారు!

image

చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే, కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. అందులో మధ్యదరా సముద్రంలో దొరికే సలేమా పోర్జీ చేప ఒకటి. ఒకవేళ ఈ చేపను తింటే ఆశ్చర్యకరమైన దుష్ప్రభావం చూపుతుంది. దీనిని తిన్న వ్యక్తి 36 గంటల పాటు అయోమయానికి లోనవుతారు. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. రోమన్ సామ్రాజ్యంలో వినోద ప్రయోజనాల కోసం దీనిని తినేవారు.

News November 20, 2024

ఐటీడీపీ నుంచే మా అమ్మ, చెల్లిని తిట్టించారు: జగన్

image

AP: తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘CBN నన్ను బోసిడీకే అని తిట్టించాడు. జూబ్లీహిల్స్ 36లోని బాలకృష్ణ బిల్డింగ్ నుంచే షర్మిలపై తప్పుడు రాతలు రాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వర్రా రవీంద్ర పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ చేత మా అమ్మ, చెల్లిని తిట్టించారు. ఫిబ్రవరిలోనే అతడిని అరెస్టు చేశాం’ అని గుర్తు చేశారు.