News April 14, 2024
తొలి విడతలో వీళ్లే రిచ్!

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఛింద్వాడాలో గెలిచి ఇప్పుడు మరోసారి పోటీకి దిగిన నకుల్ సంపద రూ.716కోట్లు అని ADR వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో రూ.662కోట్లతో AIADMK నేత అశోక్ కుమార్, రూ.206 కోట్లతో BJP నేత మాల రాజ్యలక్ష్మీ షా, రూ.159కోట్లతో BSP అభ్యర్థి మజీద్ అలీ ఉన్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News March 24, 2026
SRPT: రుణమాఫీపై అనిశ్చితి రైతుల్లో నిరాశ

ఎన్నికల హామీగా ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం పూర్తిగా అమలు కాలేదు. 2024 జూలై నుంచి విడతల వారీగా అమలు చేసినప్పటికీ జిల్లాలో ఇంకా అనేక మంది రైతులకు మాఫీ అందలేదు. 1.40 లక్షల మంది రైతుల్లో 95,350 మందికి మాత్రమే రూ.746 కోట్ల మేర మాఫీ జరిగింది. రూ.2 లక్షల లోపు రుణం ఉన్న వేలాది మంది రైతులు వివిధ కారణాలతో మాఫీకి దూరమయ్యారు. తాజా బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది.
News March 24, 2026
అనిల్ ‘మల్టీస్టారర్’ జూన్‌లో షురూ!

వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని సమాచారం. కామెడీ, యాక్షన్ అంశాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఖరారు చేశారని, మరో కథానాయిక కోసం మేకర్స్ పలు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.
News March 24, 2026
తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.


