News July 8, 2025
అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్‌లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.
News July 9, 2025
బ్రెజిల్ అధ్యక్షుడు, ప్రజలకు కృతజ్ఞతలు: మోదీ

బ్రెజిల్ నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డు అందుకోవడంపై అధ్యక్షుడు లూలా, బ్రెజిల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశ ప్రజల పట్ల బ్రెజిల్ ప్రజలకు ఉన్న బలమైన అభిమానాన్ని వివరిస్తుంది అన్నారు. రాబోయేకాలంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
News July 9, 2025
జులై 9: చరిత్రలో ఈరోజు

1875: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం(ఫొటోలో)
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం (ఫొటోలో)
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం