News June 22, 2024
పక్షుల్ని కాపాడేందుకు దోమల్ని పంపుతున్నారు.. ఎందుకంటే?

హవాయి దీవుల్లో కనిపించే హనీక్రీపర్ పక్షులను కాపాడేందుకు అధికారులు మగదోమలను పంపుతున్నారు. అదేంటంటారా? దోమల ద్వారా సంక్రమించే ఏవియన్ మలేరియా బారిన పడి ఈ పక్షులు చనిపోతున్నాయట. ఇప్పటికే 33 జాతులు అంతరించిపోయాయి. దీంతో దోమల సంతానోత్పత్తిని నిరోధించే ఓల్బాచియా అనే బ్యాక్టీరియాను కలిగిన మగ దోమలను హెలికాప్టర్ల ద్వారా విడుదల చేస్తున్నారు. వీటితో కలిసిన ఆడ దోమలు గుడ్లను పొదగలేవు.
Similar News
News December 5, 2025
కర్నూలులో వేసవి కోసం ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. చేతి పంపులు, రక్షిత నీటి పథకాలు, పైపులైన్ల లీకేజీలు తదితర మరమ్మత్తులను డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని ఆమె స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పూర్తిగా నింపాలన్నారు. గ్రామాలలో చిన్నపాటి మరమ్మతులను చేయాలని ఆదేశించారు.
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.


