News October 10, 2024
భారీగా ‘సిప్’ చేస్తున్నారు.. సెప్టెంబర్లో రికార్డు
దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మొదటిసారిగా ఒక నెలలో ₹ 24,508.73 కోట్లకు పెట్టుబడులు చేరుకున్నట్టు AMFI వెల్లడించింది. ఆగస్టు నెలలో నమోదైన ₹23,547.34 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం. సెప్టెంబర్లో 66,38,857 కొత్త సిప్లు నమోదయ్యాయి. AUMలు గరిష్ఠ స్థాయి ₹13.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం SIP ఖాతాల సంఖ్య ఆగస్టులో 9.61 కోట్ల నుంచి 9.8 కోట్లకు చేరుకుంది.
Similar News
News January 3, 2025
అధికారులు సీరియస్గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని
APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
News January 3, 2025
వైసీపీకి 11 సీట్లు.. అందుకే: చింతామోహన్
AP: మాజీ సీఎం జగన్పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని ఎద్దేవా చేశారు. YCPని ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు.
News January 3, 2025
ఆ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
TG: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకోకపోతే ACBకి వివరాలు పంపిస్తానని, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని చెప్పారు.