News March 11, 2025

నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారు: RS.ప్రవీణ్

image

TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS నేత RS.ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. అణచివేతకు గురైన వర్గాల విముక్తికి BRS సరైన వేదిక అని నమ్మి ముందుకు వెళ్తున్నా. BRS మళ్లీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

*1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
*1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
*1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
*1978: నటి కీర్తి రెడ్డి జననం
*1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
*2012: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మరణం
*అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం

News November 17, 2025

శుభ సమయం (17-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31

News November 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.