News July 5, 2024
రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: నాదెండ్ల

AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్ మాఫియాలో ఈ వాహనాల నిర్వాహకులే ప్రధాన సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
NHAIలో 84 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 84 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు DEC 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, B.L.Sc, MA, డిగ్రీ, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా.. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: nhai.gov.in
News November 25, 2025
హీరో అజిత్‌కు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

సినిమాల్లో నటిస్తూనే ప్రొఫెషనల్ కార్ రేసర్‌గానూ హీరో అజిత్ రాణిస్తున్నారు. కార్ రేసింగ్ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ ట్రాక్‌లో ఇండియా ప్రతిష్ఠను పెంచినందుకు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారాన్ని ఫిలిప్ చారియోల్ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ అందజేసింది. ఇటలీలో జరిగిన కార్యక్రమంలో అజిత్‌కు SRO మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో స్టెఫాన్ రాటెల్ అవార్డు అందజేశారు.
News November 25, 2025
అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 10 మంది మృతి

అఫ్గానిస్థాన్‌తో వివాదం వేళ ఆ దేశంపై పాకిస్థాన్ అర్ధరాత్రి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఖోస్త్, పాక్టికా, కునార్ ప్రావిన్స్‌లో మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దీంతో 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులే కావడం విషాదకరం. అఫ్గాన్ తమను లెక్కచేయకపోవడం, భారత్‌కు దగ్గరవుతుండటాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దొంగదెబ్బ తీసింది.


