News November 1, 2024
గొడవలు సృష్టిస్తోంది వాళ్లే: చింతమనేని

AP: ఏలూరు(D) దెందులూరులో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగడంపై MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. YCP అరాచక శక్తులు జనసేనలో చేరి గొడవలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అలాంటి నేతలకు పెన్షన్లు పంచే హక్కు లేదని అన్నారు. జనసేన పేరుతో వారంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వచ్చారన్నారు. భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. దీనిపై జనసేన అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Similar News
News December 6, 2025
గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్(58*)తో కలిసి న్యూజిలాండ్కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.
News December 6, 2025
Meesho: ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుంది..

IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వాల్ 2015లో ఓ ప్రయోగంలా ప్రారంభించిన స్టార్టప్ ‘మీషో’. చిన్న వ్యాపారులకు వేదికగా నిలిచింది. ధరలు తక్కువ కావడటంతో సేల్స్ పెరిగాయి. ఐదేళ్లలో కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. 2025 FYలో ₹9,390 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇప్పుడు ₹5,421 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి మీషో సిద్ధమవుతోంది. ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
News December 6, 2025
హనుమాన్ చాలీసా భావం – 30

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>


