News September 3, 2024
వరదలకు చనిపోయింది వీరే: కేటీఆర్

TG: ఇటీవల సంభవించిన వరదలకు రాష్ట్రంలో 31 మంది మరణించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు వారి వివరాలతో కూడిన జాబితాను ఆయన Xలో పోస్ట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోందన్నారు. చావుని అబద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ క్షమించరన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 27, 2026
పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచే ఎర పంటలు

కొన్ని రకాల మొక్కలు పంటకు హానిచేసే పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. వాటిని ప్రధాన పంట చుట్టూ వేస్తే పురుగుల రాక, ఉనికిని గుర్తించి నివారించవచ్చు. ఆ పంటలనే ఎర పంటలు అంటారు. వీటి వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి, రసాయనాల వాడకం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఏ ప్రధాన పంట చుట్టూ ఎలాంటి ఎర పంటలతో లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 27, 2026
కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. విభేదించిన సింగర్ చిన్మయి

ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి <<18958306>>వ్యాఖ్యలతో<<>> చిన్మయి విభేదించారు. ‘కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. కానీ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. వేధించమని నేనడగలేదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు’ అని ట్వీట్ చేశారు.
News January 27, 2026
నేడు ఇలా చేస్తే.. ముక్తికి మార్గం!

ఈరోజు మధ్వనవమి. నేడు ఆధ్యాత్మిక సాధన చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్ర దినాన హరివాయుస్తుతి, మధ్వనామ పారాయణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. విష్ణువును అర్చించి, గురువులను స్మరిస్తే మనస్సులోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని చెబుతున్నారు. సకల పాపాలను హరించి, మోక్ష మార్గాన్ని సుగమం చేసే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేస్తే వాయు దేవుడి అనుగ్రహంతో మంచి జరుగుతుంది’ అంటున్నారు.


