News December 24, 2024

YCPని లేకుండా చేయాలని చూస్తున్నారు: సజ్జల

image

AP: మాజీ MP నందిగం సురేశ్‌పై అక్రమ కేసులు పెట్టారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లొసుగులు ఉపయోగించి YCP నేతలను జైల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. జైలులో మాజీ MPకి కనీస సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. రాష్ట్రంలో YCPని లేకుండా చేయాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. అటు, పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలన్న హైకోర్టు.. పోలీసులు నోటీసులిస్తే విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Similar News

News January 23, 2026

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News January 23, 2026

వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

image

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.

News January 23, 2026

వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

image

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.