News April 15, 2025
ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి

TG: BRS MLA ప్రభాకర్ రెడ్డి <<16103245>>వ్యాఖ్యలకు<<>> మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘ప్రభుత్వాన్ని కూల్చి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రీకొడుకులు భావిస్తున్నారు. MLAలను సంతలో పశువుల్లా కొనాలి అనుకుంటున్నారు. కొత్త ప్రభాకర్ అంటే KCR ఆత్మ. కేసీఆర్ మాటలనే ప్రభాకర్ చెప్పారు. ధరణితో BRS వారి తొత్తులకు అక్రమంగా ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామని వారు భయపడ్డారు’ అని ఫైరయ్యారు.
Similar News
News April 17, 2025
భారత్‌కు మరో స్వర్ణం

పెరూలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, సురుచి సింగ్ జోడీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 10 మీటర్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి స్వర్ణం, మను భాకర్ రజతం గెలుచుకున్నారు.
News April 17, 2025
ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ జనని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. పైలట్ సాయి రోషన్ శ్యామ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ఈ బ్యూటీ బాలా తెరకెక్కించిన ‘వాడు-వీడు’ మూవీతో తెరంగేట్రం చేశారు. తెగిడి, హాట్ స్పాట్, భగీర, బెలూన్, కాజల్ కార్తీక వంటి చిత్రాల్లో నటించారు. జననికి పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.
News April 17, 2025
IPL: రాజస్థాన్ కెప్టెన్ రిటైర్డ్ హర్ట్

ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అతడు 19 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించారు. అంతలోనే పక్కటెముల గాయం వేధించడంతో మైదానాన్ని వీడారు. తర్వాతి మ్యాచుకు సంజూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.