News March 5, 2025
ఇండియాను హిందియాగా మార్చాలని చూస్తున్నారు: కమల్

జనాభా ఆధారిత ఎంపీ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ అన్నారు. దీనికి బదులు ఎమ్మెల్యే స్థానాల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని, ఇండియాను హిందియాగా మార్చాలని యోచిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TVK అధినేత విజయ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.
Similar News
News March 3, 2026
మహిళలకు సర్కారు శుభవార్త

TG: డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తోంది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను GOVT ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి ₹10L బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ GOVT చెల్లిస్తుంది.
News March 3, 2026
కలెక్టర్లూ ఇదేం తీరు… CM సీరియస్

TG: అధికారుల పనితీరుపై CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో భూ వివాదాలకు కలెక్టర్లే కారణమని అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలో ఉండకుండా HYD నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ముగ్గురు కలెక్టర్లపై మండిపడ్డారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేశామని, ఇంకా మారకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ల కాన్ఫరెన్సులో హెచ్చరించారు.
News March 3, 2026
సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.


