News November 1, 2024
ఎగబడి కొన్నారు.. అంతలోనే వదిలేశారు..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను గత ఐపీఎల్ వేలంలో KKR ఎగబడి మరీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.24.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ పట్టుమని పది నెలలు కూడా గడవకముందే అతడిని వదిలేసింది. గత సీజన్లో ఫెయిల్ కావడం వల్లే ఆ ఫ్రాంచైజీ వదిలేసినట్లు టాక్. కాగా ఈ నెలలో జరగబోయే మెగా వేలంలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 1, 2024
డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు
AP: ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. మొత్తం 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. కానీ రెండో దశ కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
News November 1, 2024
అరబ్ అమెరికన్లలో అయోమయం
గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఆయుధ, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న డెమోక్రటిక్ ప్రభుత్వంపై అరబ్ అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. 40 వేల మందికిపైగా పాలస్తీనియన్ల నరమేధంలో డెమోక్రాట్లు భాగమయ్యారని గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో వారు ట్రంప్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. దీంతో తాను అధికారంలోకి వస్తే గాజాలో యుద్ధం ఆపేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.
News November 1, 2024
డీకే వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో కాంగ్రెస్!
కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమీక్షిస్తామన్న DK శివకుమార్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు ఆ పార్టీకి లాభం చేశాయి. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో INC ఈ తరహా హామీలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో పథకాన్ని సమీక్షిస్తామని చెప్పడం ఇతర రాష్ట్రాల్లో హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తినట్టైంది.