News October 9, 2024

వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి

image

TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

గ్రహపీడ విముక్తి కోసం శనివారం గిరి ప్రదక్షిణ

image

గిరి ప్రదక్షిణను శనివారం చేస్తే గ్రహ పీడల నుంచి విముక్తి కలుగుతుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచిస్తున్నారు. జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగి జీవితం సుగమమవుతుందని అంటున్నారు. గిరి రూపంలో ఉన్న శివుడు భక్తుల కష్టాలను తొలగించి, రక్షణ కవచంలా నిలుస్తాడని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని, గ్రహగతులను అనుకూలంగా మార్చుకునే బలాన్ని ప్రసాదిస్తుందని వివరిస్తున్నారు.

News January 21, 2026

ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌లను నియమించిన BJP

image

పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎలక్షన్స్‌కు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించారు. TG మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా MH మంత్రి ఆశిష్ షేలార్‌కు బాధ్యతలు అప్పగించారు. కో-ఇన్‌ఛార్జులుగా అశోక్ పర్నామీ(RJ BJP మాజీ అధ్యక్షుడు), MP రేఖా శర్మలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. KL అసెంబ్లీ, చండీగఢ్ మేయర్, బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకూ ఇన్‌ఛార్జ్, కో-ఇన్‌ఛార్జులను నియమించారు.

News January 21, 2026

నేడు లలితా వ్రతం ఆచరిస్తే సకల సంపదలు

image

నేడు మాఘ శుద్ధ తదియ. ఈరోజు ‘లలితా వ్రతం’ ఆచరించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. లలితా దేవిని షోడశోపచారాలతో పూజించి, ఎర్రటి పుష్పాలు, కుంకుమతో అర్చన చేస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం, కన్యలు ఉత్తమమైన వరుడు లభించాలని ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికను ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.