News September 21, 2025
24 గంటలు గడవక ముందే మాట మార్చేశారు.. ఎందుకిలా?

H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ <<17768634>>హోవర్డ్<<>> ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు. కానీ 24 గంటలు తిరగకముందే వైట్‌హౌస్ మరో ప్రకటన చేసింది. కేవలం కొత్త వీసాల కోసం అప్లై చేసే వారికే ఆ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఏం జరిగింది? ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి.
Similar News
News February 10, 2026
EMIల కోసం నటించను: పంకజ్ త్రిపాఠి

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి ఆలస్యంగా సినిమాలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల పాటు తీరిక లేకుండా నటించడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. EMI కట్టేందుకో, మనుగడ సాగించేందుకో నటించలేనన్నారు. తనలోని నటుడిని సంతృప్తి పరిచే రోల్స్‌ను సెలక్ట్ చేసుకుంటానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాత్రల ఎంపికపై మరింత ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు.
News February 10, 2026
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం: చంద్రబాబు

AP: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిబంధనలు సరళతరం చేయాలన్నారు. కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించకూడదని చెప్పారు.
News February 10, 2026
ఫిబ్రవరి 10: చరిత్రలో ఈరోజు

☛ 1921: ఇండియా గేట్‌కు శంకుస్థాపన
☛ 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం
☛ 1985: సినీ గాయని ప్రియా హిమేశ్ జననం
☛ 1990: సింగర్ రేవంత్ జననం
☛ 1993: స్వాతంత్ర్య సమరయోధుడు గయా ప్రసాద్ కటియార్ మరణం (ఫొటోలో)
☛ 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు KN.రాజ్ మరణం
☛ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం


