News November 1, 2024

నాకంటే వారికే ఎక్కువ దక్కాలి: రోహిత్ శర్మ

image

ముంబై ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోగా రోహిత్ శర్మ కంటే బుమ్రా, సూర్య, పాండ్యకే ఎక్కువ మొత్తం ఇస్తోంది. దీనిపై రోహిత్ స్పందించారు. ‘నేను T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాను. జాతీయ జట్టుకు ఆడేవారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కాలని భావించా. నాకు ఇదే సరైన ప్లేస్’ అని చెప్పారు. కాగా, బుమ్రాకు రూ.18 కోట్లు, సూర్య, పాండ్యకు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మకు రూ.16.30 కోట్లు, తిలక్ వర్మకు రూ.8 కోట్లు దక్కాయి.

Similar News

News November 27, 2025

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

image

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.

News November 27, 2025

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.