News March 19, 2025

ఎంతిస్తారో కూడా నాకు చెప్పలేదు: శశాంక్ సింగ్

image

రిటెన్షన్‌లో తనకు ఎంత ఇస్తారో కూడా తెలియకుండానే సంతకం చేశానని PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ తెలిపారు. తాను వేలంలో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ‘గతంలో చాలాసార్లు నన్ను వేలంలో తిరస్కరించారు. తీసుకున్నా అవకాశాలు వచ్చేవి కావు. గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రిటైన్ చేసుకున్నారు. రిటైన్ సమయంలో నాకు ఎంత ఇచ్చేది వారు చెప్పలేదు. నేనూ బేరమాడలేదు. ఫామ్‌పై సంతకం చేశా అంతే’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News March 19, 2025

పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

image

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.

News March 19, 2025

KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో 2025-26 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతి, ఫస్ట్ ఇంటర్ ఎంట్రెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. 7, 8, 9, 10, సెకండ్ ఇంటర్‌లో మిగిలిపోయిన సీట్లకు కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. https://apkgbv.apcfss.in/ సైట్‌లో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 70751 59996 నంబరును సంప్రదించవచ్చు.

News March 19, 2025

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు తిరుమలలో పర్యటించనున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ పయనమవుతారు.

error: Content is protected !!