News March 29, 2024
వాళ్లు నాకు అన్యాయం చేయరు: రఘురామ

AP: నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్‌పై పూర్తి విశ్వాసం ఉందని, వారు తనకు అన్యాయం చేయరని పేర్కొన్నారు. కచ్చితంగా తనకు నరసాపురం టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 14, 2026
KCRను తిట్టేందుకు కవిత చాలు: కోమటిరెడ్డి

TG: BRS, KCRను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘BRS, KCRను తిట్టేందుకు ఆయన కుమార్తె కవిత చాలు. KCR ₹7లక్షల కోట్ల అప్పు చేస్తే వాటిని చెల్లిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. బంగారు తెలంగాణ చేశామని చెప్పిన KCR అధికారం కోల్పోయిన 6నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక్క సీటూ సాధించలేదు. ఆ పార్టీ గురించి ప్రజలు చూసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
News January 14, 2026
ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.
News January 14, 2026
గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.


