News March 24, 2025
వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల

TG: ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నామని, రూ.20వేల కోట్లు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను మోసం చేసిన పార్టీలకు దీనిపై మాట్లాడే హక్కు లేదని అసెంబ్లీలో MLA పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుభరోసా నిధులు ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.
Similar News
News March 26, 2025
ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్‌గా ఉండగలరా?: CM యోగి

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.
News March 26, 2025
అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.
News March 26, 2025
ఆ ఒక్క సలహా విఘ్నేశ్ జీవితాన్ని మార్చేసింది!

ముంబై స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ గురించి అతని స్నేహితుడు మహమ్మద్ షరీఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘విఘ్నేశ్ మొదట్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. లెగ్ స్పిన్‌కు మారి నైపుణ్యం సాధిస్తే మేలు చేస్తుందని సూచించా. నేను ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతనికి కొన్ని టెక్నిక్స్ నేర్పించా. పుతుర్ టాలెంట్ చూసి క్రికెట్ క్యాంపులకు వెళ్లమని చెప్పా. ఇద్దరం కలిసి 2-3 ఏళ్లు క్యాంపులకు వెళ్లాం’ అని తెలిపారు.