News June 5, 2024
లోక్‌సభ ఫలితాల్లో అత్యల్ప మెజార్టీ వీరికే

☛ రవీంద్ర దత్తారామ్ వైకర్ – శివసేన- ముంబై నార్త్ వెస్ట్- 48 ఓట్ల మెజార్టీ
☛ అదూర్ ప్రకాశ్- కాంగ్రెస్- అత్తింగళ్(కేరళ)- 684 ఓట్ల మెజార్టీ
☛ నారాయణ్ బెహరా- BJP-జయపురం(ఒడిశా) -1587 ఓట్ల మెజార్టీ
☛ అనిల్ చోప్రా-కాంగ్రెస్-జైపూర్-1615 ఓట్ల మెజార్టీ
☛ భోజ్‌రాజ్ నాగ్-BJP-కాంకేర్(ఛత్తీస్‌గఢ్)-1884 ఓట్ల మెజార్టీ
Similar News
News October 27, 2025
రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.
News October 27, 2025
తుఫాను.. ఈ విషయం గుర్తుంచుకోండి!

AP: మొంథా తుఫాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాను సమయంలో ఒక్కసారిగా వర్షాలు ఆగి, భీకర గాలులు తగ్గి, ఆకాశం ప్రశాంతంగా ఉంటే సైక్లోన్ ఎఫెక్ట్ ముగిసిందని భావించవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అది తుఫాను మధ్యలో విరామం లాంటిదని, కాసేపటికి విరుచుకుపడుతుందని చెబుతున్నారు. గతంలో విశాఖలో హుద్-హుద్ తుఫాను సమయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు.
News October 27, 2025
సిస్టర్స్ డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదాబాద్(Haryana)కు చెందిన రాహుల్(19)కు తన ముగ్గురు అక్కల మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను సైబర్ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫొటోలను SMలో పెడతామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురై రాహుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌పై కేసు నమోదైంది. రాహుల్ ఫ్రెండ్ నీరజ్‌పైనా అనుమానాలున్నాయి.


