News June 4, 2024

అసెంబ్లీకి ఓడారు.. పార్లమెంట్‌కు గెలిచారు

image

TG: 2023లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన ఇద్దరు BJP అభ్యర్థులను 6నెలల్లోనే ప్రజలు పార్లమెంట్‌కు పంపించారు. దుబ్బాకలో BJP అభ్యర్థిగా ఓడిపోయిన రఘునందన్‌రావుకు అధిష్ఠానం మెదక్ సీటు ఇవ్వగా ప్రజలు ఆదరించడంతో గెలుపొందారు. ఇటు ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చెందారు. అయినా వెనుకడుగు వేయకుండా మల్కాజిగిరి MP స్థానానికి పోటీ చేయగా ప్రజలు ఆయనను దీవించారు.

Similar News

News November 30, 2024

అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి

image

AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

News November 30, 2024

BGT: రెండో టెస్టుకు హెజిల్‌వుడ్ దూరం

image

భారత్‌తో జరిగే BGT రెండో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యారు. పక్కటెముకల్లో నొప్పితో అతడు బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మరో ఇద్దరు పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డొగెట్‌ను జట్టుకు ఎంపిక చేసింది. డిసెంబర్ 6 నుంచి జరిగే రెండో టెస్టులో హెజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్టులో హెజిల్‌వుడ్ 5 వికెట్లు తీశారు.

News November 30, 2024

బ్రేకప్‌ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేం: సుప్రీంకోర్టు

image

ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చెడిపోతే మానసిక వేదనకు గురికావడం సహజమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే బ్రేకప్‌ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు విడిపోవడం నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని తేల్చి చెప్పింది. ఇదే తరహా కేసులో కమ్రుద్దీన్ అనే వ్యక్తికి కర్ణాటక హైకోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.