News January 8, 2025
నేను వచ్చేలోపు వాళ్లను వదిలేయాలి: ట్రంప్ వార్నింగ్
గాజాలోని హమాస్ లీడర్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి (జనవరి 20) ముందే బందీలను వదిలిపెట్టాలని స్పష్టం చేశారు. లేదంటే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు. కాగా అమెరికా బందీలను విడిచిపెట్టేందుకు అగ్రరాజ్య ప్రతినిధులతో హమాస్ చర్చలు కొనసాగుతున్నాయి.
Similar News
News January 9, 2025
పవన్ ‘OG’ టీజర్ విడుదలకు సిద్ధం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్‌కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News January 9, 2025
సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.
News January 9, 2025
జనవరి 09: చరిత్రలో ఈరోజు
* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం