News December 15, 2024
స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారు: అనిత

AP: సినిమాలు చూసి యువత చెడుదారి పడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. సినిమాల్లోని మంచిని వదిలేసి, చెడునే ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత సమాజంలో డ్రగ్స్, గంజాయి, స్మగ్లింగ్ చేసేవారినే హీరోలుగా చూస్తున్నారు. కానీ ఇలాంటి సంస్కృతి పోవాలి. ఆడబిడ్డలను రక్షించేవారినే హీరోలుగా చూడాలి. మగపిల్లలను సరిగ్గా పెంచితే ఈ సమస్యలన్నీ ఉండవు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News October 31, 2025
సబ్జా గింజలతో కురులకు బలం

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News October 31, 2025
పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

బ్రూసిల్లా అబార్టస్ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News October 31, 2025
అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది

సెమీస్లో అద్భుతమైన ఆటతో భారత్ను WWC ఫైనల్ చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.


