News July 10, 2025
తెలంగాణ లేకుండా చిత్రపటం బహూకరించారు: BRS MLC

ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని BRS MLC శ్రవణ్ ఆరోపించారు. మంత్రి లోకేశ్‌కు AP BJP చీఫ్ మాధవ్ తాజాగా భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. ఇందులో TGని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి APని చూపించారని శ్రవణ్ మండిపడ్డారు. ‘ఇది TG గుర్తింపుపై AP నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని TG DGPని కోరారు.
Similar News
News July 11, 2025
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం
News July 11, 2025
కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <
News July 11, 2025
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.