News September 28, 2024

పూజలు చేయాలని చెప్పారు.. మీరెక్కడ జగన్?: సుజనా చౌదరి

image

AP: వైసీపీ శ్రేణులు శనివారం పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన జగన్.. ఇవాళ ఎటు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్నించారు. ‘పూజల్లో పాల్గొనాలని మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరి మీరు ఎక్కడ? మీరు దగ్గరలోని ఆలయానికి ఎందుకు వెళ్లలేదు? మీరు నిజంగా ఆచారాలను గౌరవిస్తే ఎందుకు వెళ్లలేదు? అందుకే టీటీడీ డిక్లరేషన్ అడుగుతోంది. నాయకులు చెప్పడమే కాదు చెప్పిన మాటను గౌరవించాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 6, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in

News December 6, 2025

పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

image

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.

News December 6, 2025

DANGER: పబ్లిక్ వైఫై వాడుతున్నారా?

image

పబ్లిక్ వైఫై సేవలు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘అత్యవసరమైతేనే వైఫై వాడండి. అపరిచిత వెబ్‌సైట్స్‌కు సంబంధించిన పాప్అప్‌ను పట్టించుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయండి’ అని పిలుపునిచ్చారు.