News February 27, 2025
పిల్లల్ని ఐసిస్‌లో చేర్చుతారా అంటున్నారు: ప్రియమణి

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్‌జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్‌లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.
Similar News
News January 23, 2026
PCOSలో రకాలు తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే దీంట్లో A, B, C, D అని నాలుగు రకాలుంటాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఏర్పడటం వంటి లక్షణాలుంటాయి.
News January 23, 2026
ICMR-NIIRNCDలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (<
News January 23, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


