News September 27, 2024
ఇది నా బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు: కొరటాల

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని అభిమానులు అంటున్నారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ప్రతి ఒక్కరి కష్టమే ఈ ఫలితమని మూవీ సక్సెస్ మీట్లో తెలిపారు. ఎవరి పనులు వారిని చేసుకోనిస్తే ఇలాంటి సక్సెస్లు వస్తాయని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఈ సినిమాకు త్వరలోనే విజయోత్సవ సభ ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://rgssh.delhi.gov.in
News January 21, 2026
సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.
News January 21, 2026
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.


