News November 26, 2024
భోజ్‌పురి ఇండస్ట్రీ పేరును వారు పాడుచేశారు: రవికిషన్

భోజ్‌పురి సినీ పరిశ్రమలో కొత్త తరం నటీనటులపై నటుడు రవి కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పేరును వారు పాడుచేస్తున్నారని మండిపడ్డారు. ‘భోజ్‌పురి సినీ పరిశ్రమలో నేను మూడో దశను ప్రారంభించాను. కానీ దాన్ని మా తర్వాతి తరం వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరిశ్రమకున్న పేరును చెడగొట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో రేసు గుర్రం, సైరా తదితర సినిమాల్లో ఆయన నటించారు.
Similar News
News November 23, 2025
KMR: పెళ్లిరోజునే కాంగ్రెస్ అరుదైన గిఫ్ట్

నిజాంసాగర్‌కు చెందిన మల్లికార్జున్ ఆలే కామారెడ్డి DCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన రాజకీయ ప్రస్థానం 2000 స.లో కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. మొదట నిజాంసాగర్ NSUI అధ్యక్షుడిగా ఆ తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, మండల వైస్ MPPగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే శుభవార్త రావడం విశేషం.
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.


