News November 13, 2024
ఏపీ శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేశారు: జగన్

APకి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ‘ఓ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని ముందు చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత పవన్, పురందీశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్తోనూ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు’ అని జగన్ మండిపడ్డారు.
Similar News
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
ఏకగ్రీవం.. ఒకే కుటుంబం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులు

TG: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉంది. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అలాగే ఆదిలాబాద్(D) తేజాపూర్లో కోవ రాజేశ్వర్, సిరిసిల్ల(D) రూప్లానాయక్ తండాలో రూప్లానాయక్ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News November 27, 2025
వాటర్ హీటర్ వాడుతున్నారా?

చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలు ఆడుకునే చోట.. హీటర్తో నీళ్లను వేడిచేయకూడదు. బాత్రూమ్లో పెడితే అక్కడ తడిగా ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఇమ్మర్షన్ రాడ్ పూర్తిగా నీటిలో మునిగిన తరవాతనే.. స్విఛ్ ఆన్ చెయ్యాలి. మెటల్ బకెట్లో పెట్టవద్దు. తడి చేతులతో, తడి బట్టలతో ముట్టుకోకూడదు.


