News September 26, 2024

లిప్‌స్టిక్ వేసుకుందని ట్రాన్స్‌ఫర్ చేసేశారు!

image

లిప్‌స్టిక్ వేసుకుందనే కారణంతో చెన్నై మేయర్ ప్రియ తన దఫేదార్ మాధవిని బదిలీ చేయించారు. హఠాత్తుగా ఆమెను మనలి మండలానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ వేసుకునే రంగులోనే దఫేదార్ కూడా లిప్‌స్టిక్ వేసుకు రావడంతో బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా లిప్‌స్టిక్ వేసుకుంటున్నానని, దీనిని ఉన్నట్టుండి మార్చుకోమనడం సబబు కాదని మాధవి వాదిస్తోంది ఈ వార్తలను కార్పొరేషన్ ఖండించింది.

Similar News

News November 24, 2025

చీకటి తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లకూడదా?

image

చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్తే దెయ్యాలు, దుష్ట శక్తులు సంచరిస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. దీని వెనుక వృక్షశాస్త్ర రహస్యం ఉంది. రాత్రిపూట రావి చెట్టు పెద్ద మొత్తంలో చెడు గాలిని విడుదల చేస్తుంది. దానిని పీల్చడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి శాస్త్రీయంగా వివరించలేక దెయ్యాల పేర్లు చెప్పేవారు. అలా జనాలను ఈ చెట్టు వద్దకు వెళ్లకుండా చేసేవారు.

News November 24, 2025

‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

image

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.

News November 24, 2025

BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<>BELO<<>>P)3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాసెస్ ఇంజినీర్, ల్యాబోరేటరీ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/