News January 24, 2025
నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు: హీరోయిన్

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో <<15056007>>వివాదం<<>> వేళ హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనానికి బాగా స్క్రాచెస్ పడ్డాయి. అయినా వాళ్లు ఆపలేదు. ‘‘పెద్దవాళ్లు’’ నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. కాగా తనను చంపాలంటే చంపొచ్చని ఇటీవల మాధవీలత వ్యాఖ్యానించారు.
Similar News
News January 23, 2026
శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.
News January 23, 2026
నేడు వసంత పంచమి.. ఈ పనులు చేయకండి

వసంత పంచమిని జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే రోజుగా చెప్తారు. ఇవాళ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘దీనిని ప్రకృతి పండుగగా భావిస్తారు. నేడు వసంత రుతువు ప్రారంభమవుతుంది. అందుకే చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు. అందుకే శుభకార్యాలు, వ్యాపారాలు ప్రారంభించొద్దు’ అని సూచిస్తున్నారు.
News January 23, 2026
నేడు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..?

వసంత పంచమి నాడు పసుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది జ్ఞానానికి, కొత్త చిగురులకు, సూర్యకాంతికి చిహ్నం. ఈరోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు అక్షింతలు వాడటంతో పాటు, నైవేద్యంగా పసుపు రంగు వంటకాలు సమర్పిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యాబుద్ధులు సొంతమవుతాయని నమ్మకం.


