News October 29, 2024
రుణమాఫీ చేయకుండా నన్ను రాజీనామా చేయమంటున్నారు: హరీశ్

TG: సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రేవంత్ వచ్చాక పాత పథకాలు ఆపేశారని, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన గుర్తు హరీశ్ చేశారు.
Similar News
News December 5, 2025
సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.
News December 5, 2025
శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.
News December 5, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.


