News October 19, 2024

శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. అంతలోనే!

image

చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా ఒక్కసారిగా అతను లేచాడు. గతంలో USAలో జరిగిన ఈ ఘటన తాజాగా వైరలవుతోంది. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. అవయవాలను చెక్ చేసేందుకు పరీక్ష చేయగా అతనిలో కదలిక, కళ్లలోంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేయగా గుండె తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి కూర్చున్నాడు.

Similar News

News October 19, 2024

డెలివరీ సేవలపై కర్ణాటక సెస్!

image

జొమాటో, ఓలా, ఉబర్, స్విగ్గీ తదితర సంస్థల డెలివరీ సేవలపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ‘రవాణా మీద మాత్రమే ఈ పన్ను విధిస్తున్నాం. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైనే ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ప్రమాదాలకు గురయ్యేందుకు, కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశాలెక్కువ. ఈ డబ్బును వారి సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు.

News October 19, 2024

రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహంతి ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 19, 2024

కుక్క లేదా పాము కరిచిందా?

image

కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 15400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.