News October 23, 2024

గంజాయి కాల్చేందుకు స్టేషన్‌కే వెళ్లారు!

image

వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Similar News

News October 23, 2024

బాధలోనే జీవన్ అలా మాట్లాడారు: TPCC చీఫ్

image

TG: తన అనుచరుడు హత్యకు గురికావడంపై MLC జీవన్ రెడ్డి ధర్నా చేయడంతో పాటు పార్టీపైనా <<14422586>>అసంతృప్తి<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుచరుడు చనిపోయాడనే బాధలోనే జీవన్ అలా మాట్లాడారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి MLAలు వచ్చిన చోట ఇబ్బందులను పరిష్కరిస్తాం. జీవన రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకి అప్పగించాం’ అని తెలిపారు.

News October 23, 2024

నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటన

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం YSR జిల్లా బద్వేలు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

News October 23, 2024

తుఫాను ముప్పు.. నాలుగు రోజులు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో AP, ఒడిశా, బెంగాల్, TN రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.