News October 29, 2024

త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్

image

TG: మీడియాతో చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతలు మూసీ పరీవాహక ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్, ఈటల తనతో రావాలని సవాల్ విసిరారు.

Similar News

News October 30, 2024

నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు

image

TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచు‌ల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుట్ట కింద వ్రత మండపంలో ఒకేసారి 2వేల జంటలు పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

News October 30, 2024

వారికి టెన్త్‌లో పాస్ మార్కులు 10 మాత్రమే

image

AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.

News October 30, 2024

నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వం: బీజేపీ

image

దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.