News August 30, 2025
వాళ్లే T20 వరల్డ్ కప్ ఓపెనర్స్ అవుతారు: రైనా

T20 వరల్డ్ కప్-2026 ఓపెనర్లుగా ఎవరుంటే బాగుంటుందో ఓ పాడ్ కాస్ట్‌లో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పారు. ‘ఓపెనర్స్‌లో ఒకరు యశస్వీ జైస్వాల్. రెండో వ్యక్తిగా ప్రియాన్ష్, అభిశేక్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. నేను అభిశేక్‌ను ఎంచుకుంటాను. గిల్ కెప్టెన్‌గా, మూడో స్లాట్‌లో ఉండాలి’ అని తెలిపారు. గిల్, శాంసన్‌ని ఎంచుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News August 31, 2025
అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు

TG: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే <<17479379>>ప్రభుత్వానికి లేఖ<<>> రాశామని, అయినా స్పందన రాలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌తో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News August 31, 2025
విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.
News August 31, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.200-220, వరంగల్‌లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.